చేతులకు బేడీలు వేసి.. పాదయాత్రకు అనుమతించండీ: ముద్రగడ Mudragada announces four-phase protest plan

Mudragada announce to take up padayatra from jan 25

mudragada hunger strike, mudragada padmanabham, satyagraha pada yatra, kapu protest, kapu reservation stir, kapu garjana, chandrababu naidu, emergency, kapu leaders, tuni violence, amalapuram, Mudragada fast unto death, mudragada hunger strike, NTR

Kapu leader and former minister Mudragada Padmanabham announced four-phase agitational programme, after holding a meeting with 10 disrict leaders of Kapus Joint Action Committee

చేతులకు బేడీలు వేసి.. పాదయాత్రకు అనుమతించండీ: ముద్రగడ

Posted: 12/03/2016 10:01 AM IST
Mudragada announce to take up padayatra from jan 25

సామాజికంగా వెనకబడిన కాపుకులస్థులను వెనకబడిన తరగతులలో చేర్చాలన్న డిమాండ్ తాము మరోమారు సత్యగ్రహ పాదయాత్రకు పూనుకోనున్నట్లు మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రకటించారు. కాపు సత్యాగ్రహ యాత్రను జనవరి 25 నుంచి చేపడతామని ఆయన పునరుద్ఘాటించారు. రావులపాలెం నుంచి అంతర్వేది వరకూ ఈ యాత్ర చేస్తామని చెప్పారు. దీనికి ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకునేది లేదని స్పష్టం చేశారు. ఏ అనుమతులు తీసుకుని ప్రతిపక్షంలో వున్నప్పుడు చంద్రబాబు పాదయాత్రలు చేశారని అయన ఎదురు ప్రశ్నించారు. నిరసన తెలిపే హక్క దేశంలోని ప్రతీ పౌరుడికి వుందని రాష్ట్రోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పినా.. అధికారం చేతిలో వుందికదా అని ప్రభుత్వం ఇష్టానికి వ్యవహరిస్తుందని అన్నారు.

కాపు నేతలు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తారని ప్రభుత్వం చెబుతున్నవన్నీ అసత్యాలేనని అయన విమర్శించారు. తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో అప్పుడు అక్కున చేర్చుకున్న పార్టీలే నేడు అధికారంలోకి వచ్చి నెలకేసి కొడుతున్నాయ్ అన్నారు. కాపు నేతల చేతులకు బేడీలు వేసి, కళ్లకు గంతలు కట్టి పాదయాత్రకు అనుమతించాలని డిమాండ్‌ చేశారు. కాకినాడలో సమావేశమైన తరువాత ఉద్యమ భవిష్యత్ కార్యచరణపై మీడియాతో మాట్లాడిన ఆయన  కాపులను బీసీ జాబితాలో చేర్చే డిమాండ్‌ను సాధించుకునేందుకు నాలుగు అంచెలుగా ఉద్యమం చేస్తామని చెప్పారు.

డిసెంబరు 18న నల్ల రిబ్బన్లు ధరించి కంచం, గరిటె చేతపట్టుకుని ఎక్కడివారు అక్కడే మోత మోగించి నిరసన తెలపాలని కోరారు. ఆరోజు మధ్యాహ్నం నుంచి తాను ఏదో ఒక జిల్లాలో కార్యక్రమంలో పాల్గొని, 36 గంటలపాటు అక్కడే ఉంటానని చెప్పారు. డిసెంబరు 30న రాష్ట్రవ్యాప్తంగా ప్రజాప్రతినిధులకు స్థానికంగా ఉండే కాపు నేతలు వినతిపత్రాలను అందజేస్తారని తెలిపారు. జనవరి 9న సాయంత్రం 7 నుంచి 8 గంటల వరకు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహిస్తామని చెప్పారు. కాపు సత్యాగ్రహ యాత్రను జనవరి 25వ తేదీన చేపడతామని, రావులపాలెం నుంచి అంతర్వేది వరకు ఈ పాదయాత్ర ఉంటుందని తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mudragada padmanabham  chandrababu  ap government  kapu reservation stir  

Other Articles